హనుమాన్ చాలీసా చదవడం నేరమైతే తాను 14 రోజులు కాదు 14 ఏండ్లు జైలులో ఉంటానని అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ అన్నారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేపై ఆమె తీవ్రంగా విరుచుకుపడ్డారు.
ఠాక్రేకు దమ్ముంటే ఎన్నికల్లో పోటీ చేసి ప్రజల చేత నేరుగా ఎన్నిక కావాలని ఆమె సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఏదేని ఓ నియోజకవర్గం నుంచి తనపై పోటీ చేసి గెలవాలని ఠాక్రేను ఆమె సవాల్ చేశారు.
రాబోయే బృహన్ ముంబై మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి తన ప్రచార షెడ్యూల్ ను ఆమె ఇప్పటికే ప్రకటించారు. రాష్ట్రంలో శివసేన నిర్మించిన అవినీతి కోటను బద్ధలు కొట్టాలని ప్రజలకు ఆమె పిలుపునిచ్చారు.
హనుమాన్ చాలీసా వివాదంలో అరెస్టైన ఆమెకు దాదాపు పన్నెండు రోజుల తర్వాత బెయిల్ వచ్చింది. బయటకు వచ్చిన ఆమె నిన్న అనారోగ్యానికి గురయ్యారు. వైద్య చికిత్సల అనంతరం ఆమె ఆదివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.