దర్శకుడు విగ్నేష్ శివన్, హీరోయిన్ నయనతార ప్రేమాయణం గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. అయితే తాజాగా ఈ ఇద్దరు కేరళ సాంప్రదాయ వేడుక అయినా ఓనం సంబరాల్లో పాల్గొన్నారు. ఈ పండుగ కోసం వీరిద్దరు కూడా ప్రైవేట్ విమానంలో చెన్నై నుంచి కొచ్చి చేరుకున్నారు. ఈ పండుగను నయన్ కుటుంబ సభ్యులతో కలిపి జరుపుకున్నారు విగ్నేష్. ఈ పండుగకు సంబంధించిన ఫోటోలను విగ్నేష్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశారు.
2015 నుంచి ఈ ఇద్దరు కూడా సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఇదే విషయమై విగ్నేష్ స్పందిస్తూ జీవితంలో అనుకున్న లక్ష్యాలు చాలా ఉన్నాయి. వాటిని సాధించిన తర్వాత పెళ్లి చేసుకుంటామని చెప్పుకొచ్చాడు.