ఏడేళ్ల ప్రేమ బంధం నుంచి వివాహం అనే కొత్త బంధంలోకి అడుగుపెట్టింది నయన్, విఘ్నేశ్ జంట. ఎన్నో ఏళ్ల నుంచి వీరి ప్రేమ విషయాన్ని గోప్యంగా ఉంచిన ఈ జంట.. గతేడాది నిశ్చితార్థం అయిన తరువాతే బయటపెట్టింది. అంతే కాకుండా వివాహనికి కూడా అత్యంత సన్నిహితులను మాత్రమే ఆహ్వానించింది.
వీరి వివాహనికి మహాబలిపురంలోని ఓ హోటల్ వేదికైంది. కోలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ ల నుంచి ప్రముఖులు ఈ పెళ్లికి హాజరై శుభాకాంక్షలు తెలిపారు. నయన్, విఘ్నేశ్ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ చిత్రాలను సరిగా గమనిస్తే.. నయన్ చేతికి పెట్టుకున్న గోరింటాకు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
నయన్ చేతి వెనుక భాగంలో WN అని కనిపించింది. దాని అర్థం.. విక్కీనయన్ అని అర్థం. ఈ పేరు నెటిజన్లకు సుపరిచితమే. విక్కీనయన్ అనే హాష్ ట్యాగ్ తరచూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంటుంది. పెళ్లిలో ఆ పేర్లలోని మొదటి రెండు అక్షరాలను గోరింటాకుగా వేసుకుంది నయన్.
ఇటు నయన్ విఘ్నేశ్ ల పెళ్లికి హాజరు కాలేకపోయిన నటీమణులందరూ సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. వీరిద్దరి వైవాహిక జీవితం ఆనందంగా, సుఖమయంగా సాగాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.