నయనతార, విజ్ఞేశ్ శివన్ ల పెళ్లి ఒక సంచలనం అనుకుంటే వారు పిల్లలని కనడం మరో సంచలనం. విజ్ఞేశ్ తన కంటే చిన్న వాడైనా సరే పెళ్లి చేసుకున్న నయనతార… పిల్లల విషయంలో ఊహించని షాక్ ఇచ్చింది. పెళ్లి చేసుకుని నాలుగు నెలలు కాకుండానే తల్లి, తండ్రులు అవడం పట్ల పెద్ద వివాదమే నడుస్తుంది. వీరు ఇద్దరూ దీనిపై కేసులను కూడా ఎదుర్కొనే అవకాశం ఉందని అంటున్నారు.
సరోగసి పద్దతిలో పిల్లలు కన్నారు అని తమిళ మీడియా అంటుంది. వాస్తవం ఏంటీ అనేది తెలియకపోయినా దాదాపుగా అలాగే చేసారని అంటున్నారు. అయితే ఇప్పుడు ఈ సమస్య నుంచి బయట పడటానికి వీరు పెద్ద ప్లాన్ చేసారని అంటున్నారు. వారి పిల్లలు పుట్టింది ఇండియా లో కాదు దుబాయిలో అని ప్రూఫ్స్ కూడా చూపించడానికి రెడీ అయ్యారట. ఇండియాలో సరోగసి కావాలంటే పెద్ద ప్రాసెస్.
తల్లి తండ్రులకు ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రమే అలా అనుమతిస్తారు. దుబాయి లో మాత్రం ఇది పూర్తిగా లీగల్ ప్రాసెస్. వారికి సరోగసి ప్రాసెస్ చేసిన ఫ్రెండ్ ఉండేది దుబాయ్ లో. ఆ లెక్కన చూస్తే వాళ్ళ పిల్లలు ఇక్కడి పౌరులు కాదు. దుబాయి పౌరుల కిందకు వస్తారు. తమిళనాడు ప్రభుత్వం కూడా దీని మీద ఏ చర్యలు తీసుకునే అవకాశం ఉండదు. సోషల్ మీడియాలో కూడా ఏ రచ్చ ఉండదు. మరి ఈ సమస్యకు ఎలా ముగింపు పలుకుతారో చూడాలి