కొత్త జంట నయనతార, విగ్నేశ్ శివన్ ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. అదేంటి.. జూన్ లోనేగా వీళ్లు పెళ్లి చేసుకుంది. అప్పుడే కవల పిల్లలు పుట్టారా? అని ఆశ్చర్యపోకండి. సరోగసి విధానంలో వీళ్లిద్దరూ తల్లిదండ్రులు అయ్యారు. ఈ విషయాన్ని వాళ్లు స్వయంగా ప్రకటించారు.
‘‘నేను నయనతార ఇద్దరు అబ్బాయిలకు పేరెంట్స్ అయ్యాం. మా లైఫ్ లో ఇది ఒక కొత్త చాప్టర్. ఈ మూమెంట్ చాలా ఆనందంగా ఉంది. నయనతార కూడా ఎంతో సంతోషంగా ఉంది’’ అంటూ విగ్నేశ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.
తమ ఇద్దరు పిల్లల పాదాలకు ముద్దు పెడుతున్న ఫోటోను కూడా పోస్ట్ చేశాడు విగ్నేశ్. 2022 జూన్ 9న నయన్, విగ్నేశ్ పెళ్లి జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజులకు నయనతార మళ్ళీ సినిమా షూటింగ్స్ లో బిజీ అయిపోయింది. నెల రోజులకు పైగానే ఇద్దరు దుబాయ్ వెళ్లి హనీమూన్ చేసుకున్నారు.
అమ్మా నాన్నలుగా ప్రమోషన్ పొందిన ఈ కొత్త జంటకు ప్రముఖులు అభిమానుల నుంచి అభినందనల వెల్లువ కొనసాగుతోంది.