హీరోయిన్ నయనతార గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దశాబ్ద కాలానికి పైగా సౌత్ లో స్టార్ హీరోయిన్ గా నిలదొక్కుకుంది నయనతార. ఇదిలా ఉండగా నయనతార తమిళ డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరి పెళ్లి గురించి మీడియాలో వార్తలకు అయితే కొదవే లేదు. అందుకు తగ్గట్టుగానే ఈ ఇద్దరు కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇక నిన్న విగ్నేష్ పుట్టినరోజు సందర్భంగా నయనతార అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిందట. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇక తాజా సమాచారం ప్రకారం ఈ ఇద్దరి పెళ్ళికి ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న కేరళలోని ఓ చర్చ్ ఈ ఇద్దరి పెళ్లిజరగబోతుందట.మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.