స్టార్ హీరోయిన్ నయనతార గురించి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. సౌత్ లో అగ్రహీరోలందరి సరసన నటించి స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న నయనతార… హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో అలరిస్తోంది. అయితే తమిళ డైరెక్టర్ విగ్నేష్ తో నయనతార ప్రస్తుతం లవ్ లో ఉన్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. కాగా తాజాగా నయనతార అమ్మ గారి పుట్టినరోజు సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు విగ్నేష్.
కేరళలో ఉండే నయనతార అమ్మ పుట్టిన రోజు సందర్భంగా చెన్నై నుండి విఘ్నేష్ శివన్ మరియు నయనతారలు కలిసి కేరళ వెళ్లారు. అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫొటోలలో విఘ్నేష్ శివన్ నయన్ ఫ్యామిలీకి చాలా ఎంతో క్లోజ్ గా ఉన్నట్లు కనిపిస్తోంది.