సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ నయనతార, తమిళ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ప్రేమాయణం అందరికీ తెలిసిందే. ఈ మధ్య ఈ ప్రేమ పక్షులు బహిరంగంగా కూడా కనపడుతున్నారు. నయన్ ఇంటికి విఘ్నేష్ వెళ్తుండటం, ఇద్దరూ కలిసి హాలీడేస్ ట్రిప్స్ వెళ్తూ వస్తున్నారు. త్వరలో వీరిద్దరు పెళ్లి పీటలెక్కబోతున్నారని ప్రచారం జరుగుతుంది.
అయితే, ఈ ఇద్దరు తమ షూటింగ్ ల కోసం… హైదరాబాద్ వచ్చారు. ఇద్దరూ తమ, తమ లొకేషన్స్ కు దగ్గరల్లోనే ఉంటున్నారు. కానీ వీరిద్దరు ఇంత వరకు కలవలేదు. హైదరాబాద్ వచ్చేప్పుడు కూడా కలిసి రాలేదు. దీంతో ఈ ఇద్దరి మధ్య ఏం జరిగింది… ముచ్చటగా మూడోసారి కూడా నయన్ బ్రేకప్ చెప్పిందా అన్న అనుమానాలు, ప్రచారాలు మొదలైపోయాయి.
ఈ ప్రేమ పక్షులు దూరంగా ఉంటున్న మాట వాస్తవమే అయినా… కలవకుండా ఉండేందుకు అసలు కారణం మాత్రం బేకప్ కాదని తెలుస్తోంది. దూరంగా ఉండాలని రజనీకాంత్ చిత్ర యూనిట్ పెట్టిన షరతులే కారణమని అంటున్నారు. నయనతార రజనీకాంత్ తో కలిసి అన్నాత్తే సినిమాలో నటిస్తున్నారు. ఈ షూటింగ్ హైదరాబాద్ లో నడుస్తుండగా… డైరెక్టర్ విఘ్నేష్ కాదు వాకుల రెండు కదల్ సినిమా షూట్ కూడా హైదరాబాద్ లోనే జరుగుతుంది. అయితే, అన్నాత్తే షూటింగ్ స్పాట్ కు ఎవరూ రాకూడదని, షూటింగ్ షెడ్యూల్ పూర్తయ్యే వరకు భయటి వారిని ఎవరూ కలవవద్దని నిబంధన విధించారట. కరోనా నేపథ్యంలో తీసుకున్న ఈ నిర్ణయంతోనే… ఒకే ప్లేస్ లో ఉన్నా… నయన్, విఘ్నేష్ లు కలుసుకోవటం లేదని తెలుస్తోంది.