నయనతార, విగ్నేష్ శివమ్ నూతన జంట ప్రస్తుతం హనీమూన్ ఎంజాయ్ చేస్తుంది. హనీమూన్ కోసం థాయ్‌లాండ్ వెళ్లిన ఈ జంట.. అక్కడ ఘాటు రొమాన్స్ లో మునిగి తేలుతోంది. థాయ్‌లాండ్ కలియతిరుగుతూ అక్కడి అందాలను ఆస్వాధిస్తున్నారు.
అయితే.. వీరి హనీమూన్ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఎయిర్‌పోర్ట్ లో వీరిద్దరు ఓ అభిమానితో కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. ఇందులో నయనతార, విఘ్నేష్ దరించిన బ్లూ జీన్స్ డ్రెస్ గురించి నెట్టింట చర్చ జరుగుతోంది.
మరోవైపు బ్యాంకాంక్ లో ఓ స్టార్ హోటల్ లో దిగినట్టు తెలుస్తుంది. పక్కన వాటర్, చెట్లు ఇలా ఎంతో ఆహ్లాదకరంగా ఉన్న ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్నారు. అన్నీ వదిలేసి ఇద్దరే ఏకాంతంగా గడుపుతున్నారు. జీవితాంతం గుర్తిండిపోయేలా ఈ హనీమూన్ ని ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయ్యారట.
ఎల్లో డ్రెస్ ధరించి నయన్ చైర్ లో కూర్చొగా.. భర్త విఘ్నేష్ ఆమెకి ప్రేమ పాఠాలు చెప్తున్నట్టు ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటో చూసిన నెటిజన్లు.. ఇద్దరూ తమ ప్రేమ కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారని కామెంట్ పెడుతున్నారు.