లాంగ్ గ్యాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత సైరా నరసింహారెడ్డి అంటూ ప్రేక్షకులను అలరించాడు. ఇక అప్పటి నుంచి కూడా వరుస సినిమాలను ఒకే చేస్తున్నాడు. ఇక చిరు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత వేదాళం, లూసిఫర్ లో నటించబోతున్నాడు.
ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార చిరు సరసన నటించబోతుందట. ఇప్పటికే నయనతార తో సంప్రదింపులు కూడా జరిగాయట. ఒక్క రెమ్యూనరేషన్ ఖరారైతే అన్నీ ఓకే అయిపోయినట్లేనని తెలుస్తోంది. మరి ఈ విషయంలో నిర్మాతలు ఓకే చేస్తారా లేక వేరొక ఆప్షన్ వెతుక్కుంటారా అనేది వేచి చూడాలి.