నెట్రికన్..ఇది సూపర్ స్టార్ రజనీకాంత్ 1981 నాటి మూవీ టైటిల్. అది ఇప్పుడు అందాల తార నయనతార కొత్త మూవీ టైటిల్. మిలింద్ రా దర్శకత్వంలో రౌడీ పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్న నెట్రికన్ మూవీ టైటిల్ పోస్టర్ విడుదల చేశారు.
అంధులు చదివే బెయిలీ లిపిలో పోస్టర్ ఉంది. అంటే ఈ మూవీలో నయనతార అంధురాలి పాత్ర పోషిస్తుందని సమాచారం. అంతే కాకుండా పోస్టర్లో రక్తం బేడీలు కనిపిస్తున్నాయి. ఇది క్రైం థ్రిల్లర్ కావచ్చంటున్నారు.
నయనతార 65 మూవీకి టైటిల్ ఇచ్చిన రజనీకాంత్ కు ట్విట్టర్ ద్వారా
నయన్ ప్రియుడు విఘ్నేష్ శివన్ కృతజ్ఞతలు తెలియజేశారు. పూజా కార్యక్రమాలకు నయన్ కాకుండా విఘ్నేష్ శివన్ హాజరు కావడం విశేషం. వచ్చే సంక్రాతికి రానున్న నెట్రికన్ అన్ని హంగులతో రూపొందిస్తున్నారు.