సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార గురించి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. అగ్ర హీరోలందరి సరసన నటించి సూపర్ డూపర్ హిట్ ను అందుకుంది నయనతార. అయితే నయనతార గత కొన్నాళ్లుగా తమిళ డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో ప్రేమలో ఉన్నారు. ఇప్పటికే ఈ ఇద్దరు ఎంగేజ్మెంట్ కూడా జరిగినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం పెళ్ళి తర్వాత నయన్ సినిమాలు ఆపేయాలని నిర్ణయం తీసుకుందట. ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలను మాత్రమే కంప్లీట్ చేస్తుందట. కొత్త సినిమాలు ఏవి కూడా ఓకే చేయట్లేదని సమాచారం. అయితే ఇందులో ఎంత వరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది.