హీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ పీకల్లోతు ప్రేమలో ఉన్నారని తెలిసిందే. ఈ ఏడాదే తమ పెళ్లి జరుగుతుందని ఆమధ్య క్లారిటీ ఇచ్చాడు విఘ్నేష్. అయితే ఎప్పుడూ నయన్ దీనిపై స్పందించలేదు. కానీ.. తాజాగా ఓ ఛానల్ ప్రోగ్రాంలో పాల్గొన్న ఆమె.. విఘ్నేష్ తో పెళ్లిపై తొలిసారి మాట్లాడింది.
యాంకర్ అడిగిన ప్రశ్నకు.. ఎంగేజ్ మెంట్ అయ్యిందని, ఇదిగో రింగ్ అంటూ నయన్ చూపించినట్లుగా ప్రోమో కట్ చేశారు. కొన్నాళ్ల క్రితం చేతికి రింగ్ తో విఘ్నేష్ గుండెల మీద చేయి పెట్టిన ఫోటోను షేర్ చేసింది నయన్. అప్పుడే ఎంగేజ్ మెంట్ అయిందని అందరూ అనుకున్నారు. తాజాగా నయన్ ఈ విషయాన్ని కన్ఫామ్ చేశారు. అయితే పెళ్లి ఎప్పుడనే విషయాన్ని మాత్రం చెప్పలేదు.
ఈ సందర్భంగా సోషల్ మీడియాలో నయన్, విఘ్నేష్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కానీ.. ఇది ప్రోమో వీడియో అని.. ప్రోగ్రాంలో ఏదైనా ట్విస్ట్ ఇస్తారని కొందరు అంటున్నారు.
😍😍😍 Lady SuperStar நயன்தாரா – வரும் ஞாயிறு காலை 10:30 மணிக்கு நம்ம விஜய் டிவில.. #LadySuperstarNayanthara pic.twitter.com/TmY15QeVZ9
— Vijay Television (@vijaytelevision) August 10, 2021
Advertisements