లేడీ సూపర్ స్టార్ నయనతార షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఒకప్పుడు తన అందచందాలతో కుర్రకారును తనవైపుకు తిప్పుకున్న నయన్.. గత కొంతకాలం నుంచి రొమాంటిక్ సీన్లకు, గ్లామర్ పాత్రలకు దూరంగానే ఉంటోంది. ఈ మధ్య ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలే చేస్తోంది. అందులోనూ తన పాత్రకు డిమాండ్ ఉన్న స్టోరీస్ నే ఎంచుకుంటోంది ఈ భామ. కానీ ఇప్పుడు ఓ సినిమా కోసం గ్లామర్ షోకి నయన తార గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది.
ఇంతకీ అది ఏ సినిమా అని అనుకుంటున్నారా? బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ ‘జవాన్’ మూవీ. స్క్రిప్ట్ డిమాండ్ చేయడంతో పాటు డైరెక్టర్ అట్లీ కూడా రిక్వెస్ట్ చేయడంతో గ్లామర్ షోకి నయన్ ఓకే చెప్పిందట. ఈ చిత్రంలో ఫస్ట్ ఆఫ్ లో నయన తార లుక్ ప్రేక్షకుల్ని స్టన్ చేసేలా ఉండబోతుందట. అందుకు బికినీ కూడా వేసుకోనుందని టాక్ వినిపిస్తోంది.
అయితే ఇందుకు నయన తార ఓ కండీషన్ పెట్టిందట. తాను అడిగినంత పారితోషికం ఇస్తే.. గ్రామర్ షోకి ఓకే అని చెప్పిందని తెలుస్తోంది. దీంతో ఆమెకు ఏకంగా రూ.10 కోట్లు రెమ్యునరేషన్ ఇస్తున్నారని ఓ టాక్ సినీ పరిశ్రమలో చక్కర్లు కొడుతోంది.
ఈ విషయంలో ఎంత నిజముందో తెలీదు కానీ.. బాలీవుడ్ తో పాటు చెన్నై మీడియాలో కూడా నయన తార జవాన్ కి రూ.10 కోట్లు తీసుకుంటోందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనిపై క్లారిటీ రావాలంటే.. నయన్ కానీ.. జవాన్ టీమ్ కానీ రియాక్ట్ అవ్వాల్సిందే. కాగా జవాన్ మూవీ ఈ ఏడాది అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని సన్నాహాలు చేస్తోంది చిత్ర యూనిట్.