ఏడాది ఆరంభంలో భీష్మ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో నితిన్. ప్రస్తుతం నితిన్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నితిన్ సరసన మహానటి ఫేమ్ కీర్తి సురేష్ నటిస్తుంది. ఈ సినిమా తరువాత హిందీ సినిమా అంధాధున్ రీమేక్ లో నటిస్తున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వం లో వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా నాని హీరోగా వచ్చిన గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక మోహన్ ను తీసుకున్నారట.
ఇక హిందీలో కీలక పాత్ర చేసిన టబు పాత్రకోసం తెలుగులోనూ ఆమెనే అనుకున్నారట. కానీ కుదరకపోవడంతో ఆమె పాత్రలో స్టార్ హీరోయిన్ నయనతార ను సంప్రదిస్తున్నారట నిర్మాతలు. నయన్ ఒప్పుకుంటే ఈ సినిమా పై ఉన్న అంచనాలు మరింత పెరుగనున్నాయి. మరి నయన్ ఏం చేస్తుందో చూడాలి.