మరో లవ్ జంట పెళ్లి చేసుకుంది. సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ పెళ్లి చేసుకున్నారు. మహాబలిపురంలోని ఓ రిసార్ట్ లో వీళ్ల పెళ్లి గ్రాండ్ గా జరిగింది. రజనీకాంత్, షారూక్, సూర్య లాంటి ప్రముఖులు హాజరయ్యారు.
ఉదయం 10 గంటల 30 నిమిషాల టైమ్ లో నయన్ మెడలో తాళి కట్టాడు విఘ్నేష్. ఆ వెంటనే నూతన వధూవరులు రజనీకాంత్ ఆశీస్సులు తీసుకున్నారు. తామిద్దరికి పెళ్లయిన విషయాన్ని విఘ్నేష్ స్వయంగా వెల్లడించాడు. తాళి కట్టిన తర్వాత నయన్ ను ముద్దాడిన ఫొటోను షేర్ చేశాడు.
రజనీ, షారూక్ తో పాటు అట్లీ, అనిరుధ్, కేఎస్ రవికుమార్, కార్తి, దర్శకుడు మణిరత్నం, దర్శకుడు సూర్య లాంటి చాలామంది ప్రముఖులు ఈ పెళ్లికి హాజరయ్యారు. నూతన వధూవరుల్ని ఆశీర్వదించారు.
పెళ్లి సందర్భంగా తమిళనాడులోని లక్షమంది పేదలు, అనాథలకు భోజనాలు పెట్టారు నయన్-విఘ్నేష్ జంట. తమ టీమ్ ద్వారా తమిళనాడులోని వివిధ దేవాలయాలు, అనాథాశ్రమాల్లో లక్షమందికి భోజనం అందించారు. వీళ్లలో 18వేల మంది చిన్నారులు కూడా ఉన్నారు.