ఒకప్పుడు పిల్లలు అది ఒక మహా యజ్ఞం మాదిరిగా ఉండేది. ఇప్పుడు మాత్రం అనేక నూతన విధానాలు అందుబాటులోకి రావడంతో కాస్త కామెడీగా మారిపోతుంది. ప్రధానంగా సరోగసి విధానం వచ్చిన తర్వాత పిల్లలు అనేది కామెడి అయిన మాట వాస్తవం. తాజాగా నయనతార, విజ్ఞేశ్ శివన్ దంపతులకు పిల్లలు పుట్టడం మాత్రం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. వీరు వివాహం చేసుకుని నాలుగు నెలలు మాత్రమే అవుతుంది. కాని నిన్న అనూహ్యంగా తల్లి తండ్రులు అయినట్టుగా ఇద్దరూ ప్రకటించారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. ఇక వాళ్లకు పేర్లు కూడా పెట్టారు. సరోగసి అనే విషయం అధికారికంగా ప్రకటించకపోయినా… కోలివుడ్ లో వస్తున్న వార్తల ప్రకారం అది నిజమే అనే మాట వినపడుతుంది.
ఇక వాళ్లకు పెట్టిన పేర్ల గురించి చర్చ జరుగుతుంది. స్టార్ హీరో సూర్య వారికి పేర్లు పెట్టినట్టుగా సమాచారం. ఉయిర్ , ఉలగం అనే పేర్లను పెట్టారు ఇద్దరికీ. వీరి పెళ్లి సమయంలో సూర్య, జ్యోతిక దంపతులు సందడి చేసారు. విజ్ఞేశ్ శివన్ తో పాటుగా నయనతారకు వాళ్ళు సన్నిహితులే. సూర్య కెరీర్ మార్చిన గజినీ సినిమాలో నయనతార కీలక పాత్ర పోషించింది. అప్పటి నుంచి వీరికి సాన్నిహిత్యం ఉంది. అందుకే మీకు కవల పిల్లలు పుడతారు అని పుడితే ఉయిర్ , ఉలగం అని పేర్లు పెట్టుకోమని చెప్పాడని అంటున్నారు.