నూతన జంట నయన్ విఘ్నేశ్ లు నెట్ ప్లిక్స్ సంస్థకు రూ.25 కోట్లు కట్టాలని ఆ సంస్థ నుంచి నోటీసులు అందుకున్నట్లు ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే పెళ్లికి సంబంధించిన వీడియో స్ట్రీమింగ్ హక్కులను ఈ జంట నెట్ ప్లిక్స్ కి రూ. 25 కోట్లకు అమ్మేసింది.
అందుకు గాను ఆ సంస్థ వీరితో ఓ ఒప్పందం కుదుర్చుకుంది. దాని ప్రకారం పెళ్లి ఏర్పాట్లు, హోటల్ బుకింగ్స్, సెక్యూరిటీ, విందు భోజనాల కోసం నెట్ ప్లిక్స్ నే నగదు కూడా చెల్లించిందంట. ఆ తర్వాత నయన్ విఘ్నేశ్ వివాహ వేడుకల తతంగాన్ని ఇప్పటి వరకు ప్లే చేయలేదు. దీనికి కారణం నయన్ విఘ్నేశ్ లతో ఈ డీల్ రద్దు చేసుకోవడమే కారణమని చెబుతున్నారు. ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన కొన్నిపిక్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి.
అయితే అవన్నీ విఘ్నేశ్ ఇన్ స్టా ద్వారానే బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే నెట్ ప్లిక్స్ తమ ఒప్పందాన్ని రద్దు చేసుకుందంట. ఈ వేడుకకు సంబంధించి అన్ని హక్కులు మాకే ఉండగా ప్రముఖుల తో దిగిన చిత్రాలను ఎలా బయటకు పోస్ట్ చేస్తారంటూ నెట్ ప్లిక్స్ ప్రశ్నిస్తుంది. దీంతో చేసుకున్న డీల్ ను రద్దు చేస్తూ తాము కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఖర్చు చేసిన మొత్తాన్ని తిరిగి ఇవ్వమని నెట్ ప్లిక్స్ నోటీసులు పంపినట్లు వార్తలు షికార్లు చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఇప్పుడు అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పింది నెట్‌ఫ్లిక్స్. నయన్-విఘ్నేశ్ లవ్స్టోరీపైన తీసిన డాక్యుమెంటరీని త్వరలోనే రిలీజ్ చేస్తామని ప్రకటించింది.
వీరి లవ్‌స్టోరీ చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నయన్-విఘ్నేశ్ కాంబినేషన్లో ఇటీవల విడుదలైన ‘కాత్తువాకుల రెండు కాదల్’ (తెలుగులో కన్మణి ర్యాంబో ఖాటిజా) మంచి హిట్ అందుకుంది.