నాయిని రాజేందర్ రెడ్డి,
హన్మకొండ కాంగ్రెస్ కమిటీ అద్యక్షులు.
ఈ నెల 8 న హైదరాబాద్ సరూర్ నగర్ లో ప్రియాంక గాంధీ పాల్గొనే నిరుద్యోగ జంగ్ సైరన్ ను విజయవంతం చేయాలి. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత్ జోడో కార్యక్రమానికి అనుగుణంగా మరియు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థి, నిరుద్యోగ వ్యతిరేక విధానాలపై, పేపర్ లీక్ లకు నిరసనగా నిరుద్యోగ జంగ్ సైరన్ సభ నిర్వహిస్తున్నాం.
సరూర్ నగర్ గ్రౌండ్ లో మే 8 న నిర్వహిస్తున్న ఈ భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా ప్రియాంక గాంధీ వస్తున్నారు. హన్మకొండ జిల్లాలో నియోజకవర్గాల్లో ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేసి జిల్లా నలుమూలల నుంచి భారీగా జనసమీకరణం చేసి, ప్రతి మండలంలో మండల అధ్యక్షులు సమావేశాలు ఏర్పాటు చేసి భారీ జనసమీకరణతో సభను విజయవంతం చేయాలి.
నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించలేని ఈ విధానం తెలంగాణ మోడలా, ఉద్యోగాలు ఇవ్వకపోతే నిరుద్యోగులకు భృతి ఇస్తామంటూ 2018 ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. వారు చెప్పిన ప్రకారం ఈ 51 నెలలకు గానూ ఒక్కో నిరుద్యోగికి రూ.1.60 లక్షల నిరుద్యోగభృతి ఈ ప్రభుత్వం బాకీ ఉంది.
రాష్ట్రంలోని 30 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వాలి. తొమ్మిదేళ్ల పాలనలో ఉద్యోగాలెందుకు భర్తీ చేయలేదు. అందుకే ఈ నెల 8న జరిగే నిరుద్యోగ జంగ్ సైరన్ సభకు వేలాది మంది తరలి రావాలి. హన్మకొండ జిల్లాలో అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 20 వేల రూపాయల నష్టపరిహారం అందించాలి.
ఈ సీజన్లో ఇప్పటికే రెండు సార్లు అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంట నేలపాలు కావడం దురదృష్టకరం. పరిహారం అందే అవకాశం లేకపోవడంతో అన్నదాతల ఆందోళన బూడిదలో పోసిన పన్నీరవుతుంది. పంట చేతికి వచ్చి పెట్టుబడికి తెచ్చిన అప్పులు తీర్చవచ్చు అనుకుంటే అకాల వర్షం చావు దెబ్బతీసింది.
పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10వేల చొప్పున పరిహారం గంటలో ఇస్తానని కేసిఆర్ చెప్పిన వారం రోజులవుతున్న ఇంతవరకు అందలేదు. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను వెంటనే సర్వే చేయించి రైతులకు ఎకరాకు రూ.20 వేల రూపాయల చొప్పున నష్ట పరిహారం అందించాలని, మార్కెట్ కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యాన్ని కొనుగోలు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలి.