నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఎన్.బి.కే 107 అని వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఇకపోతే ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. కాగా నేడు హీరోయిన్ శృతిహాసన్ పుట్టినరోజు.
ఈ సందర్భంగా మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసి ఆమెకు బర్త్ డే విషెస్ తెలిపారు. అలాగే డైరెక్టర్ గోపీచంద్ కూడా శృతి హాసన్ తో దిగిన ఫోటో ని షేర్ చేస్తూ ఆమెకు విషెస్ తెలిపారు.
ఇదిలా ఉండగా ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తుండగా కన్నడ నటుడు దునియా విజయ్ కుమార్ విలన్ గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు.
ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా… సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. ఇక గతంలో శృతిహాసన్ గోపీచంద్ క్రాక్ సినిమాతో మంచి హిట్ అందుకున్నారు.
Wishing the most talented and dearest friend @shrutihaasan a very happy birthday..have wonderful year ahead wit success, Health and happiness ❤️🤗🤗. #HBDShrutiHaasan pic.twitter.com/dlv5UWwDzf
— Gopichandh Malineni (@megopichand) January 28, 2022
Advertisements