నటసింహ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గోపీచంద్ చివరిసారిగా క్రాక్ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. అలాగే అఖండతో బాలకృష్ణ కూడా మంచి హిట్ ను అందుకున్నాడు. ఇక మైత్రీ మూవీ మేకర్స్ వారు NBK 107 సినిమాను నిర్మిస్తున్నారు.
ఇదిలా ఉండగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ శుక్రవారం సిరిసిల్లలో ప్రారంభం అయింది. భారీ యాక్షన్ సీక్వెన్స్ ను ఇక్కడ షూట్ చేయబోతున్నారట. సినిమాకు ఇవే యాక్షన్ సీన్స్ హైలెట్ గా నిలవనున్నాయట.
బాలకృష్ణ కూడా మొదటి రోజు నుండి టీమ్‌లో చేరాడు. ఈ యాక్షన్ సీక్వెన్స్‌కు రామ్-లక్ష్మణ్ లు కొరియోగ్రాఫీ చేస్తున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.
యదార్థ సంఘటనల ఆధారంగా తెరక్కుతున్న ఈ సినిమాలో విలన్‌గాకన్నడ స్టార్ దునియా విజయ్ నటిస్తున్నారు. అలాగే వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.