సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఈయన బాలీవుడ్ నటుడిగానే కాక తెలుగులోనూ ఆయన నటించిన ధోని సినిమా విజయం సాధించడంతో ఆయన తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువయ్యారు. అంతా బాగుంది అనుకుంటున్న తరుణంలో ఆయన ఆత్మహత్య చేసుకోవడం పెద్ద సంచలనం అయ్యింది.
కాగా ఈ కేసులో ఆయన ప్రియురాలు,నటి రియా చక్రవర్తి మాదకద్రవ్యాలు కొనుగోలు చేసి సుశాంత్‌కు ఇచ్చినట్లు ఆరోపిస్తూ తాజాగా నేషనల్ నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) చార్జీషీట్ దాఖలు చేసింది. మరో 34 మంది పేర్లను కూడా ఎన్‌సీబీ ఈ చార్జీషీట్ లో పేర్కొంది.
అయితే రియానే సుశాంత్‌కు మాదక ద్రవ్యాలు అలవాటు చేసింది రియానే అనే ఆరోపణలు ఉన్నాయి. ఆమె సోదరుడు సోవిక్ చక్రవర్తితో పాటు ఆమె ఎవరెవరి దగ్గర మాదక ద్రవ్యాలు కొనుగోలు చేసిందో వారిని కూడా ఎన్‌సీబీ నిందితులుగా పేర్కొంది.
ఎన్‌సీబీ ఛార్జీషీట్‌లో చేసిన అభియోగాలు నిజమని రుజువైతే మాదకద్రవ్యాల నిరోధక చట్టం కింద రియాకు పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని అంటున్నారు. రియా తో పాటు, ఆమె సోదరుడు తో పాటు మరికొంత మంది కలిసి ఒక గ్రూప్‌గా ఏర్పడి మాదక ద్రవ్యాలను సరఫరా చేసినట్లు ఆరోపణలున్నాయి.
నిందితులు ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు ఆర్థిక సాయం అందించారని తెలుస్తోంది. గంజాయి,కొకైన్‌తో పాటు ఇతర మాదక ద్రవ్యాలు సైకోట్రోపిక్ పదార్థాలను ఉపయోగించారని ఎన్‌సీబీ పేర్కొంది. రియా సోదరుడు వారితో తరచూ సంప్రదింపులు చేసేవాడని తెలిపింది.
కాగా ఈ కేసులో రియా 2020 సెప్టెంబర్ లో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నెలరోజులకు ఆమె బెయిల్ పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే.