బాలీవుడ్ ని షేక్ చేసిన డ్రగ్స్ వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్ వైపు మళ్ళింది. ఇదే వ్యవహారం టాలీవుడ్ ని కూడా కుదిపేస్తోంది. ముంబైలోని ఓ హోటల్లో డ్రగ్స్ సప్లయర్ తో టాలీవుడ్ నటి పట్టుబడ్డ సంగతి తెలిసిందే. అయితే కాసేపట్లో ముంబై కోర్టులో ఆ హీరోయిన్ ను ఎన్సీబీ అధికారులు ప్రవేశపెట్టనున్నారు.
హైదరాబాద్ కి చెందిన మహమ్మద్, డ్రగ్ పెడ్లర్ సయ్యద్ కు నటికి ఉన్న సంబంధాల పై ఎన్సీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే నటితో టాలీవుడ్ లో ఇంకా ఎవరికైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో ఎన్సీబీ అధికారులు విచారిస్తున్నారు. గతంలో రకుల్ ప్రీత్ తో పాటు బాలీవుడ్ కి చెందిన దీపిక, పదుకొనే, శ్రద్ధ కపూర్, సారా అలీ ఖాన్ లు ఎన్సీబీ విచారణను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.