దేశంలో అధికారులు ఎంత కట్టుదిట్టంగా ఉన్నప్పటికీ స్మగ్లర్లు విదేశాల నుంచి అక్రమ మార్గంలో మాదక ద్రవ్యాలను తీసుకుని వస్తున్నారు.
తాజాగా మహారాష్ట్ర ముంబయిలో భారీ ఎత్తున మాదక ద్రవ్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 50 కేజీల మెఫెడ్రోన్ అనే మత్తు పదార్థాలను ముంబయి క్రైమ్ బ్రాంచ్ కు చెందిన యాంటీ నార్కోటిక్స్ సెల్ సీజ్ చేసింది.
ముంబయి గౌడౌన్లో అంతర్జాతీయ మార్కెట్‌పై దాడులు చేసిన అధికారులు.. 50 కేజీల మెఫెడ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
సీజ్ చేసిన మాదక ద్రవ్యాల విలువ రూ.120 కోట్లు ఉంటుందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఎయిర్ఇండియా మాజీ పైలట్‌తో సహా ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు చెప్పారు.