బాలీవుడ్ ను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసు కొంతకాలంగా సైలెంట్ కావటంతో అంతా ఊపిరిపీల్చుకుంటున్నారు. కానీ సడన్ గా బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ పేరు తెరపైకి వచ్చింది. కరణ్ జోహార్ కు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో-ఎన్సీబీ నోటీసులు జారీ చేసింది.
సుశాంత్ సుసైడ్ కేసులో కరణ్ జోహార్ ఇచ్చిన ఓ విందు అంశం తెరపైకి వచ్చింది. ఇందులో డ్రగ్స్ వాడారంటూ పలు కథనాలు వచ్చాయి. దీనిపై అప్పట్లోనే కరణ్ జోహార్ ఓ వీడియో పోస్ట్ చేసి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తన పార్టీలో ఎవరూ డ్రగ్స్ వాడలేదని ఆయన స్పష్టం చేశారు.
కానీ తాజాగా డ్రగ్స్ కేసుకు సంబంధించి కరణ్ జోహార్ వివరణ కోరుతూ ఎన్సీబీ అధికారులు నోటీసులు జారీచేశారు. శిరోమణి అకాలీదల్ నేత మన్జీందర్ ఫిర్యాదు మేరకు ఎన్సీబీ చర్యలకు ఉపక్రమించింది.