మహారాష్ట్రలో కలిసి పనిచేద్దామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రతిపాదనను తిరస్కరించానని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వెల్లడించారు. తన కూతురు సుప్రియా సూలె కు కేంద్ర కేబినెట్ లో స్థానం కల్పిస్తానన్నా తాను అంగీకరించలేదని చెప్పారు. మహారాష్ట్ర చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం చెప్పారు. మహారాష్ట్రలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వ ఏర్పాటు వెనుక శరద్ పవార్ కీలక పాత్ర పోషించారు. శివసేనతో తమకు మంచి సంబంధాలున్నందున బీజేపీ తో కలిసి పనిచేయడం కుదరదని చెప్పానని తెలిపారు. ప్రధాని మోదీ తనకు రాష్ట్రపతి పదవి ఆఫర్ చేసినట్టు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు.