వేలుపట్టి నడిపి ఈ ప్రపంచాన్నిపరిచయం చేస్తాడు తండ్రి. తన గుండెల్ని పానుపుగా చేసి నిద్రపుచ్చుతాడు తండ్రి. కన్నకూతురి కోసం యోగ్యుణ్ణి తెచ్చి, తనకన్నా వయసులో చిన్నవాడైన వరుడి కాళ్ళు కడుగుతాడు తండ్రి.అలాంటి తండ్రిని హతమార్చాలని చూసిందో ఓ యువతి. విశాఖలో జరిగిన ఈ ఘటన పోలీసులని సైతం నివ్వెరపోయేలా చేసింది. నిద్రపోతున్న తండ్రిని హత్యచేయాలని చూసిన మైనర్ బాలిక కేసు రకరకాల మలుపులు తిరుగుతోంది.
విశాఖలోని అక్కయ్యపాలెంకి చెందిన బాలిక ఇంటర్మీడియట్ చదువుతుంది.. అయితే, అదే ప్రాంతానికి చెందిన బాలుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది.. అయితే ఆమె కుటుంబ సభ్యులకు తెలియకుండానే దాదాపు రెండు లక్షల రూపాయల నగదు..8 తులాల బంగారం.. కొంత వెండి ఆభరణాలు ఆ బాలుడు కుటుంబానికి ఇచ్చింది బాలిక..ఈ విషయం తెలిసిన తండ్రి ప్రశ్నించడంతో ఆమె ఓ రోజు నిద్రపోతున్న తండ్రిని చాకుతో పొడిచింది.
కానీ, ఆఖరి నిమిషంలో తండ్రి మేలుకోనడంతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు.. ఇక, ప్రేమికుని వలలో పడి ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు తొలి దశలో పోలీసులు భావించారు. అయితే ఆ బాలుడు కుటుంబ సభ్యులు తనని మార్ఫింగ్ ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేసి తన తండ్రిని, తమ్ముడిని కడ తేర్చమని చెప్పడంతోనే..ఈ తరహాలో ప్రవర్తించినట్లు ఆ బాలిక పోర్త్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇరు కుటుంబాలను పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు.. తన తండ్రిపై దాడికి పాల్పడినట్లు కూడా తనకు తెలియకుండానే ఈ ఘటన జరిగిపోయిందని సదరు బాలిక ఆవేదన వ్యక్తం చేసింది..
ప్రియుని కుటుంబం ట్రాప్ చెయ్యడం వలనే తండ్రి పై దాడి చేసినట్టు చెబుతున్న మైనర్ బాలిక..తన ప్రియుడికి గతంలో కూడా ఇతర యువతులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెబుతోంది.. ప్రేమ పేరిట మోసం చేసి తమ డబ్బు, నగదు దోచుకున్నారని.. ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతామంటూ బ్లాక్ మెయిల్ చేశారని కన్నీరుమున్నీరవుతోంది
కాగా, బాలిక కత్తితో తండ్రి మెడపై పొడిచింది. ప్రియుడి మోజులో పడిన బాలిక తన ఇంట్లో ఉన్న రూ.2 లక్షల నగదు, 8 తులాల బంగారు ఆభరణాలను ఆ యువకుడికి ఇచ్చింది. ఈ విషయం తెలుసుకున్న బాలిక తండ్రి కూతురిని నిలదీశాడు. ఇంట్లో కొన్ని రోజులుగా తండ్రి, కూతురు మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఈ విషయాన్ని బాలిక ఆమె ప్రియుడికి చెప్పింది.
తన దగ్గర డబ్బులు లేవని నీవే ఏదో ఒకటి చేయాలని యువకుడు చేతులెత్తేశాడు. దీంతో బాలిక కత్తితో కన్న తండ్రిపై దాడి చేశారు. వెంటనే అప్రమత్తమైన తండ్రి స్వల్ప గాయాలతో తప్పించుకున్నాడు. బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు పోలీసులు బాలికను అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ యువకుడికి మరొకరితో ప్రేమ వ్యవహారం నడుస్తోందని బాలిక బంధువులు పేర్కొన్నారు. ఆమె ప్రోద్బలంతోనే డబ్బు కాజేశారని ఆరోపిస్తున్నారు. మొత్తంగా ఈ వ్యహారంలో విశాఖలో సంచలనంగా మారింది.