గత ఐదేండ్లలో 16,831 భారత యాత్రికులు పాకిస్తాన్ ను సందర్శించారని విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వీ. మురళీధరన్ రాజ్యసభలో తెలిపారు. అదే సమయంలో 2119 మంది పాకిస్తానీ యాత్రికులు భారత్ ను సందర్శించినట్టు ఆయన వెల్లడించారు.
బీజేపీ ఎంపీ మహేశ్ పోద్దార్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధాన మిస్తూ.. భారత్, పాక్ మధ్య యాత్రికుల సందర్శనలు ద్వైపాక్షిక ప్రోటోకాల్స్ 1974 కింద జరుగుతున్నట్టు పేర్కొన్నారు.
ఈ ప్రోటోకాల్ ప్రకారం పాక్ లోని 15 , ఇండియాలోని 6 పుణ్యక్షేత్రాలకు తీర్థయాత్రలను సులభతరం చేసినట్టు ఆయన వివరించారు.
ప్రభుత్వం డేటా ప్రకారం … అత్యధికంగా 2021లో భారతీయ యాత్రికులు 5425 మంది పాక్ ను సందర్శించారు. ఆ తర్వాత 2019లో 4,273 మంది వెళ్లినట్టు తెలిపారు.
పాక్ నుంచి 2017లో అత్యధికంగా 984 మంది ఇండియాకు సందర్శనకు భారత్ కు వచ్చినట్టు తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఇరు దేశాల నుంచి ఎలాంటి సందర్శనలూ జరగలేదని చెప్పారు.