కర్నాటకలోని కొడగు జిల్లాలో అద్భుత దృశ్యం కనువిందు చేస్తోంది. 12 ఏళ్లకోసారి పూచే నీలకురింజి పువ్వులు విరబూశాయి. మందలపట్టి కొండమీద ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పుష్పాలను చూసేందుకు రెండు కళ్లు చాలడం లేదని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
నిజానికి ఈ పూలు పూసిన తర్వాత వాడిపోతాయట. విత్తనాలతో మొలకెత్తే ఈ మొక్కలు మళ్లీ పూతకు రావాలంటే 12 ఏళ్లు పడుతుందని స్థానికులు చెబుతున్నారు.