జీవితంలో కొంత మంది చావు అంటేనే భయపడతారు. మరి కొంత మంది చావు అంచుల వరకు వెళ్లినా కూడా భయపడరు. వారిలో ఉండే కాన్ఫిడెన్స్ లెవెల్, జీవితం పట్ల అవగాహన అలాంటిది. వారు ఎక్స్పీరియన్స్ ను అనుభవిస్తారు తప్ప భయపడరు. అలాంటి వారిలో ఇటీవల ఇండియా తరఫున టోక్యో ఒలంపిక్స్ లో బంగారు పతకం సాధించిన స్పోర్ట్స్ హీరో నీరజ్ చోప్రా కూడా ఒకరు. ఈ జావెలిన్ త్రో ఛాంపియన్ ఇటీవల కౌన్ బనేగా కరోడ్పతి అనే కార్యక్రమంలో పాల్గొన్నాడు.
అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న ఈ షోలో ఆయన తనకు జీవితంలో ఎదురైన దిగ్భ్రాంతికర సంఘటనలను, 15 నిమిషాల చావు ఎక్స్పీరియన్స్ ను వెల్లడించారు.నీరజ్ విమానంలో అబుదాబి నుంచి ప్రాంక్ ఫర్ట్ వెళ్తున్నారట. అయితే విమానం అనుకోకుండా అదుపు తప్పి క్షణాల్లో విమానంలో ఉన్న వారికి మృత్యు భయం ఎలా ఉంటుందో రుచి చూపించిందట. విమానం వేగంగా కిందకి పడిపోతున్నట్టు అనిపించిందట.
ఆ సమయంలో లో నీరజ్ హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఉండడంతో విమానం లోపల నెలకొన్న గందరగోళాన్ని ఆలస్యంగా గమనించాడట. ఆయన హెడ్ ఫోన్స్ తీసేటప్పటికీ పిల్లలు, పెద్దలు ఏడుస్తున్నారట. మరికొంతమంది ఇది భయంతో అరుస్తున్నారట. ఈ ఒలింపిక్ ఛాంపియన్ మాత్రం తన పక్కన కూర్చున్న ఫిజియో తో అరవడం వల్ల ఉపయోగం ఏముంది? ఏం జరగాలో అదే జరుగుతుంది అంటూ కూల్ గా చెప్పాడట. ఆయన చెప్పిన ఈ రియల్ లైఫ్ హారర్ స్టోరీ ఇప్పుడు వైరల్ అవుతోంది.