దేశ వ్యాప్తంగా నీటి పరీక్షల నిర్వహణ పై అందులోని లోపాలపై ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సరిగ్గా ఇలాంటి టైంలో బీహార్ రాష్ట్రానికి చెందిన సంతోష్ కుమార్ యాదవ్ నీట్ పరీక్ష సమయంలో తాను ఎదుర్కొన్న సవాళ్లను ఒక లోకల్ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో
“తాను నీట్ పరీక్ష రాయడానికి బీహార్ నుండి కోల్‌కతాలోని ఎగ్జామ్ సెంటర్ కు రీచ్ అవ్వడానికి సుమారు ఏడు వందల కిలోమీటర్లు ప్రయాణించానని కాని దురదృష్టవశాత్తు ఎగ్జామ్ సెంటర్ కు రీచ్ అవ్వడానికి 10 నిమిషాలు లేట్ అయిందని ఆ కారణంగా తనను ఆ స్కూల్ సిబ్బంది ఎగ్జామ్ రాయడానికి అంగీకరించలేదని దానివల్ల తను ఓ సంవత్సరం టైమ్ ని కోల్పోవాల్సి వచ్చిందని అన్నాడు.”
ఇక కోవిడ్ పరీక్షలు కోసం నీట్ పరీక్షలు రాసే విద్యార్థులు మూడు గంటల ముందు తమ సెంటర్ లకు చేరుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది.ఇక అందుకోసమే సంతోష్ కుమార్ యాదవ్ శనివారం ఉదయం బీహార్ లో బస్సు ఎక్కేనని కాని అది ఆరు గంటలు లేట్ అయ్యిందని ఆతరువాత తాను మరో పాట్నా లో ఉదయం 9 గంటలకు మరోబస్సు మారానని ఆ బస్సు కోల్‌కతా చేరడానికి మధ్యాహ్నం 01:10 అయిందని ఇక అక్కడి నుండి తన ఎగ్జామ్ సెంటర్ చేరుకోవడానికి క్యాబ్ లో వచ్చానని కాని అప్పటికే లేట్ అయ్యిందని తాను బాధపడ్డాడు.
ఇక దీనిపై స్పందించిన బిజేపి బెంగాల్ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోషల్ సుప్రీంకోర్టు నీట్ పరీక్షలు రాసే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వాలపై బాధ్యతను పెట్టారని దీన్ని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పట్టించుకోకపోవడం వల్లనే దాదాపు 70 శాతం మంది విద్యార్థులు బెంగాల్ లో ఇలాంటి పలు రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారని అభిప్రాయపడ్డారు.
ఇక విశ్లేషకులు అయితే పార్టీలన్నీ రాజకీయాలు చేయడంపై చూపిన శ్రద్ధ విద్యార్థుల పై చూపలేదని అందుకే ఇలాంటి సంఘటనలను చూడవలసి వచ్చిందని అంటున్నారు.మరి నీట్ పరీక్ష రాయలేకపోయిన సంతోష్ కుమార్ యాదవ్ లాంటి వారి పరిస్థితికి కారణం ఎవరు అని మీరు అనుకుంటున్నారో మాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.