జాతీయ స్థాయిలో నిర్వహించే జేఈఈ, నీట్ ప్రవేశ పరీక్షల తేదీలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వైరస్, లాక్ డౌన్ అనిశ్చితికి తెరదించుతూ కేంద్రం ప్రకటన చేసింది. కేంద్రం జారీ చేసిన వివరాల ప్రకారం… జులై 18-23 వరకు జేఈఈ మెయిన్స్, ఆగస్టులో అడ్వాన్స్డ్ పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్.
జులై 26న నీట్ పరీక్షను నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. పెండింగ్లో ఉన్న సీబీఎస్ఈ 10,12వ తరగతి పరీక్షలపై అతి త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు పోఖ్రియాల్.
పెండింగ్లో ఉన్న సీబీఎస్ఈ 10,12వ తరగతి పరీక్షలపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు పోఖ్రియాల్