నీట్-పీజీ కౌన్సిలింగ్ కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2021-22 ఏడాది నీట్ పీజీ కౌన్సిలింగ్ నిర్వహించుకునేందుకు అనుమతిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ఉన్న రిజ్వర్వేషన్ల ప్రకారం జరిపించాలని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు ప్రకారం ఓబీసీలకు 27శాతం, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 10శాతం రిజర్వేషన్లు వర్తించనున్నాయి.
నీట్-పీజీ కౌన్సిలింగ్ పై దాఖలైన పిటిషన్ ను శుక్రవారం విచారణ జరిపిన జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఏఎస్ బోపన్నల ధర్మాసనం ఈ తీర్పును వెలువరిచింది. ఇప్పటివరకు జరిగన విధంగా రిజర్వేషన్లు కేటాయిస్తూ.. 2021-22 కౌన్సిలింగ్ నిర్వహించాలని సూచించింది. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు వార్షిక ఆదాయం రూ.8లక్షలుగా నిర్ణయించటంపై మార్చి 5న తుది తీర్పులో వెల్లడిస్తామని తెలిపింది.
Advertisements
ఈ కౌన్సిలింగ్ నిర్వహించాలని నెల నుంచి దేశవ్యాప్తంగా రెసిడెంట్ డాక్టర్లు సమ్మె చేస్తున్నారు. పీజీ వైద్య విద్య ప్రవేశాల్లో ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కోటా అమలుకు గతేడాది జూలైలో కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ ను సవాల్ చేస్తూ పలువురు అభ్యర్థులు సుప్రీంకోర్టు తలుపు తట్టారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పునిచ్చింది. దీంతో వైద్యుల చేస్తున్న ఆందోళనలకు తెరపడింది.