ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ప్రత్యేకంగా మహిళల కోసమే ఓ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీ. మహిళా సాధికారతే లక్ష్యంగా ‘హర్ సర్కిల్‘ పేరుతో దీన్ని ప్రారంభించారు. మహిళలకు సంబంధించిన విషయాలు మాత్రమే ఇందులో ఉంటాయి.
హెల్త్, వెల్త్, ఎడ్యుకేషన్, కెరీర్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్, బ్యూటీ, ఎంటర్‌టైన్‌మెంట్‌కు సంబంధించి విస్తృతమైన ఆర్టికల్స్ ఇందులో అందుబాటులో ఉంచుతారు. అక్షర రూపంలోనే గాక.. వీడియోల ద్వారా ఈ సమాచారాన్ని హర్ సర్కిల్‌లో అందిస్తారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన విజయాలను సాధించిన మహిళల సక్సెస్ స్టోరీస్‌ను పరిచయం చేస్తారు. కేవలం విషయ పరిజ్ఞానాన్ని అందించడమే కాదు… అవసరమైన విషయాల్లో సందేహాలు తీర్చేందుకు కొందరు నిపుణులను కూడా అందుబాటులో ఉంచుతారు.
కంప్యూటర్‌తో పాటు మొబైల్ యాప్‌గానూ హర్ సర్కిల్. ఇన్ పనిచేస్తుంది. ఎవరైనా తమ సూచనలు, ఆలోచనలను ఈ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో పంచుకోవచ్చు. ప్రస్తుతం ఇంగ్లిష్‌లో మాత్రమే లభ్యమవుతుండగా… త్వరలోనే ఇతర భాషల్లోనూ కూడా ప్రారంభించనున్నారు.