నేహశర్మ… చిరుత సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమాతోనే అందం, నటనలో మంచి మార్కులు కొట్టేసింది ఈ భామ. దీంతో ఆమెకు అవకాశాలు వెతుక్కుంటు వచ్చాయి.
అయితే బాలీవుడ్ మీద కన్నేసిన భామ హిందీ చిత్రాలకే ప్రాధాన్యత ఇచ్చింది. అందుకే తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించలేదు. ఇక బాలీవుడ్ లో బిజీగా ఉండే ఈ భామ తరచుగా సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోస్తూ ఆ ఫోటోలను కుర్రాలపైకి విసురుతుంది.
తాజాగా ఈ అమ్మడు ఎరుపు రంగు లెహంగాలో ఫోటోలకు ఫోజు ఇచ్చారు. ఆ ఫోటోలను తన ఇన్ స్టా హ్యాండిల్ లో షేర్ చేశారు. ఆ ఫోటోలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.
ఎరుపు డ్రెస్ లో అమ్మడి అందాలను చూస్తూ కుర్రాళ్లు వెర్రెక్కి పోతున్నారు. ఆ భామ అందాలను అభివర్ణిస్తూ కవులుగా మారిపోతున్నారు. ఎరుపు డ్రెస్సులో మెరుపు సుందరి అంటూ క్యాప్షన్స్ పెడుతున్నారు.