నెల్లూరు జిల్లా సెంట్రల్ జైలులో కరోనా కలకలం రేగింది. తాజాగా మరో 20 మంది ఖైదీలకు పాజిటివ్ నిర్ధారణ అయింది. అంతకుముందే మరో 52 మంది వైరస్ బారినపడటంతో.. మొత్తం కేసుల సంఖ్య 72కు చేరింది.
రెండు రోజులుగా సంజీవని బస్సు ద్వారా జైలులో ఉండే ఖైదీలకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం 72 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్ వచ్చిందని జైలు సూపరింటెండెంట్ ప్రకటించారు. వైరస్ బారిన వారికి ప్రత్యేక ఐసోలేషన్ గదులు కేటాయించినట్టు చెప్పారు. అలాగే ముందుగా జాగ్రత్తగా జైలు పరిసరాలన్నీ శానిటైజ్ చేసినట్టు తెలిపారు..