అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయిన హీరో నవీన్ చంద్ర. మొదటి సినిమాతో హిట్ అందుకున్నప్పటికీ నవీన్ చంద్ర అనుకున్నంత సక్సెస్ సాదించలేకపోయాడు. పాత్రకు ఉన్న ప్రాముఖ్యతను బట్టి విలన్ గా కూడా నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ప్రస్తుతం నవీన్ చంద్రహీరోగా సురేష్ దర్శకత్వంలో ఎమ్ ఎస్ సుబ్బలక్ష్మి సమర్పణలో త్రిషాల ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై కళ్యాణ్ కందుకూరి నిర్మాతగా ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాకు ‘నేను లేని నా ప్రేమ కథ’ అంటూ టైటిల్ ఫిక్స్ చేశారు. తాజాగా ఆ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాలో నవీన్ చంద్ర సరసన గాయత్రి ఆర్ సురేష్ నటిస్తుంది.