22 మంది ప్రయాణీకులతో వెళుతున్న తారా ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం అదృశ్యమైంది. నైన్ ఎన్ఏఈటీ ట్విన్ ఇంజిన్ ఎయిర్ క్రాఫ్ట్ కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ)తో సంబంధాలు తెగిపోయినట్టు అధికారులు వెల్లడించారు.
ఈ విమానంలో నలుగురు భారతీయులు ఉన్నారు. విమానానికి ఆదివారం ఉదయం 9 గంటల 55 నిమిషాలకు ఏటీసీతో సంబంధాలు తెగిపోయినట్టు అధికారులు వెల్లడించారు. చివరగా విమానం ముస్తాంగ్ జిల్లాలో కనిపించిందని స్థానికులు చెబుతున్నారు.
ఆ తర్వాత విమానం దౌలదర్ శిఖరం వైపుగా విమానం వెళ్లినట్టుగా అధికారులు తెలిపారు. విమానం ఆచూకిని కనుగునేందుకు అధికారులు రంగంలోకి దిగారు. విమానం జాడను తెలుసుకునేందుకు ముస్టంగ్, పోఖారాల నుంచి రెండు హెలికాప్టర్లను నేపాల్ ప్రభుత్వం పంపింది.
2016 ఫిబ్రవరిలో తారా ఎయిర్ లైన్స్ కు చెందిన ఎయిర్ క్రాఫ్ట్ ఒకటి ప్రమాదానికి గురైంది. పొఖారా నుంచి జామ్ సామ్ కు వెళుతున్న ఎయిర్ క్రాఫ్ట్ పశ్చిమ నేపాల్ ప్రాంతంలో క్రాష్ అయింది. ఈ ఘటనలో 23 మంది మరణించారు.