నేపాల్ రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. ప్రధాని కేపీ శర్మ ప్రత్యర్థులకు ఝలక్ ఇచ్చారు. ప్రస్తుత పార్లమెంట్‌ను రద్దు చేయాలని రాష్ట్రపతికి సిఫార్సు చేసారు. ఉదయం అత్యవసరంగా నిర్వహించిన కేబినెట్ భేటీలో. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆ దేశ ఇంధన శాఖ మంత్రి బర్షమాన్ పున్ ఈ విషయాన్ని వెల్లడించారు.
ప్రభుత్వం తీసుకొచ్చిన ఓ ఆర్డినెన్స్ రద్దు చేయాలంటూ అధికార నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీలోని ప్రధాని ఓలి వ్యతిరేక వర్గం.. కొంతకాలంగా డిమాండ్ చేస్తోంది. ఈ వర్గాన్ని మాజీ ప్రధాని ప్రచండ డైరెక్ట్ చేస్తున్నారు. వాళ్లని శాంతింపజేసేందుకు కేపీ శర్మ చాలా ప్రయత్నాలే చేశారు. కానీ ఫలించలేదు. ఒక దశలో ఈ గొడవ పార్టీ చీలిక వరకూ తీసుకెళ్లింది. ఆ పరిణామాలను నివారించడానికే.. కేపీ శర్మ పార్లమెంట్‌ను రద్దు నిర్ణయం తీసుకున్నట్టుగా భావిస్తున్నారు. తాత్కాలిక ప్రభుత్వానికి ఆయనే నేతృత్వం వహించనున్నారు.