కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ఓ టి డి ప్లాట్ ఫామ్ లకు ఆదరణ పెరిగింది. అమెజాన్ నెట్ ఫ్లిక్స్, లాంటి డిజిటల్ సంస్థలు మరింత లాభాలను పొందాయి. అయితే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. డిసెంబర్ 5, 6 తేదీల్లో భారతదేశమంతటా ఫ్రీగా నెట్ ఫ్లిక్స్ వినియోగించుకోవచ్చని తెలిపింది. రెండు రోజుల పాటు మొత్తం ఉచితంగా చేసుకోవచ్చని సంస్థ పేర్కొంది. అయితే ఈ వార్త సినిమా ప్రేమికులకు ఓ మంచి గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
అయితే దీనికి కారణం ఆ రెండు రోజుల పాటు ఈ ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమ్ ఫేస్ట్ ను నిర్వహిస్తుంది. మన దేశంలో మొదటి సారి ఈ ఫేస్ట్ నిర్వహించనుంది. అందులో భాగంగా ఈ రెండు రోజులు ఫ్రీ గా నెట్ ఫ్లిక్స్ ఫ్రీ గా స్ట్రీమ్ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ ఆఫర్ ను మొదటగా భారతదేశంలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ ఆఫర్ కోసం క్రెడిట్ ,డెబిట్ కార్డులను వాడనవసరం లేదు. ఈ మెయిల్ అడ్రస్ ఉంటే చాలు.