ప్రముఖ ఆన్‌లైన్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ భారీగా డిస్కౌంట్స్‌ను ప్రకటించింది. కొత్తగా నెట్‌ఫ్లిక్స్‌లో వీడియోలు, సినిమాలు చూడాలనుకునే వారికి అదిరిపోయే ఆఫర్స్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఈ ఆఫర్స్‌తో తన ఖాతాదారులను పెంచుకునేందుకు ఈ కొత్త ఆఫర్స్‌తో ముందుకు వచ్చినట్లు కనపడుతోంది. 3000కోట్లతో నెట్‌ఫ్లిక్స్ లోకల్ కంటెంట్‌ను రెడీ చేస్తోందని… దేశవ్యాప్తంగా అన్ని భాషలకు విస్తరించే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్, జీ5 సంస్థలు సంవత్సర ప్యాకేజీలను కొంతకాలం కాటు ప్రకటించాయి. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ కూడా అందులో చేరిపోయింది.
సంవత్సర చందాదారులుగా చేరాలనుకునే వారికి 50శాతం డిస్కౌంట్‌ను ప్రకటించింది. 9588రూపాయలున్న చందాను కేవలం 4799రూపాయలకే ఆఫర్ చేస్తోంది. ఇక ఆరు నెలల ప్యాకేజిని 30శాతం డిస్కౌంట్‌తో 3359రూపాయలకు, మూడు నెలల ప్యాకేజీని 20శాతం తగ్గింపుతో 1919రూపాయలకు అందివ్వనున్నట్లు తెలిపింది. నెట్‌ఫ్లిక్స్ నెలసరి అద్దె 199 ఇప్పటి వరకు తన సేవలను ఇస్తోంది.
మరో బాంబు పేల్చిన అమ్మరాజ్యం వర్మ