సౌత్ లో అంతగా రాణించలేకపోయినప్పటికీ బాలీవుడ్ లో మాత్రం మంచి జోష్ తో దూసుకుపోతోంది హీరోయిన్ తాప్సీ. డిఫరెంట్ స్టోరీస్ తో సినీ అభిమానులను ఆకట్టుకుంటూ విమర్శకులను సైతం మెప్పిస్తోంది. ఇక ఇటీవల రష్మీ రాకెట్ షూటింగ్ ను తాప్సీ పూర్తిచేసింది. అయితే ఈ సినిమాని ఓ అథ్లెట్ నిజీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమా లో పాత్ర కోసం తను కఠోరశ్రమ పడినట్లు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో తాప్సి షేర్ చేసుకుంది.
మరోవైపు మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ జీవిత కథ ఆధారంగా శభాష్ మిథు సినిమాలో తాప్సీ ప్రధాన పాత్రలో నటిస్తోంది. అందుకుగాను క్రికెట్ కు సంబంధించిన స్కిల్స్ నేర్చుకుంటుంది. క్రికెట్ సాధనకు సంబంధించిన ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తాప్సి పోస్ట్ చేస్తూనే ఉంది. కాగా నెటిజన్ లు కామెంట్ ల రూపంలో ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.