సోషల్ మీడియాలో పంచులు అప్పుడప్పుడు భలే పేలుతుంటాయి. మరీ ముఖ్యంగా రాజకీయనేతల పంచెలూడదీసినంత పనిచేస్తుంటారు కొన్నిసార్లు నెటిజన్లు. వారు చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన లేకపోతే అంతే సంగతులు. అయితే సెటైర్లు.. లేదంటే కౌంటర్లతో అడ్డంగా ఇరికించేస్తుంటారు. తాజాగా మంత్రి కేటీఆర్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.
“వీళ్లెప్పుడైనా ఉద్యమంలో కనబడ్డారా.. ఒక్కరినన్న ఎప్పుడన్నా చూశారా.. ఎప్పుడైనా మీతో భుజం భుజం కలిపి పనిచేశారా? ఇగ వీళ్లుగూడ మాట్లాడుతుంటరు.. మీదికెళ్లి ఎగిరెగురుతుంటరు.. ఆలోచించండి.. ఆగం గాకండి” అంటూ కేటీఆర్ ఆ వీడియోలో మాట్లాడుతోంటే.. అందులో మంత్రులు తలసాని, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి, మల్లారెడ్డి, ఎమ్మెల్సీ ఆఫర్ అందుకున్న కౌశిక్ రెడ్డి, ఇటీవల టీఆర్ఎస్‌లో చేరిన ఎల్.రమణ ఫోటోలను సెట్ చేశారు. దీంతో ఆ వీడియోను చూసినవారంతా.. తెగ నవ్వుకుంటున్నారు. వావ్ కేటీఆర్.. ఒక గొప్ప నిజాన్ని చెప్పారు.. హ్యాట్సాఫ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఇదే..