తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ అమలు చేసేదే లేదని గతంలో అనేకమార్లు ప్రకటించి.. తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ట్రోలింగ్ నడుస్తోంది. ఆయుష్మాన్ భారత్ దిక్కుమాలిన స్కీమ్ అని ఒకసారి.., ఆయుష్మాన్ భారత్ వద్దని ప్రధాని మోహం మీదే చెప్పిన అధ్యక్షా.. చాటుకు చెప్పలే.. వాళ్లకు తెలుసా లేదా అది వాళ్ల విజ్ఞత.. ఆయుష్మాన్ భారత్ ఎందుకు పనికిరాదు అధ్యక్షా అని మరోసారి అసెంబ్లీలో కేసీఆర్ విమర్శలు చేశారు.
ఇక ఇంకోసారి ఓ బహిరంగ సభలో అసలు ఆయుష్మాన్ భారత్ అనే స్కీమ్ కోసం ప్రధాని మోదీ తెలంగాణ ఆరోగ్యశ్రీని కాపీ కొట్టారని.. అది అకుకి అందదు..పోకకు పొందదు అంటూ సెటైర్లు వేశారు. ఇలా ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలతో కూడిన వీడియోలను ఒక్కచోట చేర్చి నెటిజన్లు ఇప్పుడు తెగ ట్రోల్స్ చేస్తున్నారు. అందులో ఈ వీడియో వైరల్‌గా మారింది.