తన అందంతో అభినయంతో టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన నటి నగ్మా. ప్రస్తుతం సినిమాకు దూరంగా ఉన్న నగ్మా… కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయనాయకురాలిగా మారిపోయింది. అయితే మామూలుగు సెలబ్రిటీలు కొంచెం దొరికినా నెటిజన్లు ఆడుకుంటుంటారు. ఇప్పుడు నగ్మా అదే పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అయితే అందులో పాకిస్థాన్ కు మద్దతు పలికిన ఓ జర్నలిస్టుకు నగ్మా కూడా తన మద్దతు తెలిపింది.
అంతే కాకుండా సోషల్ మీడియాలో కూడా అదే తరహా పోస్టులు చేసింది. అయితే భారత్ ను వ్యతిరేకిస్తూ పాక్ కు మద్దతు పలికిన జర్నలిస్టుకు తన మద్దతు కూడా తెలిపినందుకు సోషల్ మీడియా వేదికగా నగ్మాకు చుక్కలు చూపిస్తున్నారు నెటిజన్లు. తననే కాకుండా తాను ఇప్పుడు కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ పై కూడా మండిపడుతున్నారు. అయితే మరి నెటిజన్లకు ఇప్పుడు నగ్మా ఏ విధంగా సమాధానం చెప్తుందో.