మెగా బ్రదర్ నాగబాబు బుల్లితెర రియాల్టీ షో జబర్దస్త్ ద్వారా పాపులారిటీ సంపాదించారు. ఒకవైపు నటుడిగా, నిర్మాతగా రాణిస్తూనే బుల్లితెర షో లకు వ్యవహరిస్తున్నారు. అయితే ఇటీవల జబర్దస్త్ షో నుంచి బయటకు వచ్చిన ఆయన అదిరింది, బొమ్మ అదిరింది షో లకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నాగబాబు ఎక్కువగా ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాలను బయట పెడుతూ ఉంటారు.
తాజాగా నాగబాబు చేసిన ట్వీట్ ఆయనను నెటిజన్లు ఆడుకునేలా చేసింది. విషయం ఏంటంటే జనవరి 6 ఏ ఆర్ రెహమాన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా నాగబాబు ఏ ఆర్ రెహమాన్ ఫోటో పెట్టి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆ తరువాత అదేవిధంగా కపిల్ దేవ్ పుట్టినరోజు సందర్భంగా కూడా విషెస్ తెలిపారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ కపిల్ దేవ్ ఫోటో కి బదులుగాబాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ 83 పేరుతో వస్తోన్న ఓ సినిమా పోస్టర్‌ను నాగబాబు షేర్ చేశాడు. దీంతో నెటిజన్స్ నాగ బాబు పై రేంజ్‌లో కామెంట్స్ చేస్తున్నారు.