వర్షమొచ్చినప్పుడు నీళ్లు రాకపోతే మంటలొస్తయా..అంటూ వరదలను కవరేజ్ చేసిన కొన్ని చానెళ్లపై ఆ మధ్య మంత్రి తలసాని చేసిన వ్యాఖ్యలు.. గ్రేటర్ ఫలితాలతో ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చాయి. వర్షమొచ్చినప్పుడు వచ్చే నీళ్లను పట్టించుకోకపోతే.. ప్రజల గుండెలు నిజంగానే మండిపోతాయన్న విషయం తలసానికి ఇప్పుడు అర్థమై ఉంటుందని సోషల్ మీడియాలో కొందరు సెటైర్లు వేస్తున్నారు. అలాగే తెలంగాణలో బీజేపీ ఎక్కడుందని తలసాని కామెంట్లను కూడా గుర్తు చేస్తూ.. మీరు ఆలుగడ్డలు అమ్మిన మోండా మార్కెట్‌లోనూ ఇప్పుడు బీజేపీనే ఉంది చూసుకోవాలంటూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.
తలసానిని నెటిజన్లు ఇంతలా టార్గెట్ చేయడానికి కారణం ఆయనకు అత్యంత ప్రతిష్టాత్మకమైన డివిజన్ మోండా మార్కెట్‌లో బీజేపీ జెంగా ఎగరడమే. మోండా మార్కెట్ నుంచే తలసాని రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. కార్పొరేటర్ స్థాయి నుంచి రాష్ట్ర మంత్రివరకూ ఎదిగారు. అలాంటి చోట బీజేపీ జెండా ఎగరేడం తలసానికి పెద్ద దెబ్బే.