మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సోషల్ మీడియాలో ఒక్కసారిగా ట్రోలింగ్ పీస్‌గా మారిపోయారు. గత నెల తన సతీమణి రాసిందంటూ తన ట్విట్టర్ అకౌంట్‌లో ఆయన షేర్ చేసిన ఓ కవిత పరువు తీసింది. దాన్ని రాసింది సీఎం సతీమణి కాదని.. తాను రాస్తే కాపీ కొట్టి పేరు మార్చుకున్నారంటూ మరో మహిళ సీఎం అకౌంట్‌ను ట్యాగ్ చేస్తూ తాజాగా ఓ పోస్ట్ పెట్టింది. దీంతో కవితను కాపీ కొట్టడమే కాక.. తన భార్య రాసిందంటూ చెప్పుకోవడం సీఎంకు సిగ్గు చేటుఅని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ విషయం కాస్త రాజకీయ రంగు కూడా పులుముకుంది. కాంగ్రెస్ నేతలు సీఎంపై విమర్శలకు దిగారు. వేరే వాళ్లు చేసిన పనులకు పేర్లు మార్చి తమదని నమ్మించడం బీజేపీకి అలవాటే అంటూ ఎద్దేవా చేస్తున్నారు.
The poem is written by me… not by ur beloved wife 🙏🏻🙏🏻@aajtak @ChouhanShivraj @Republic_Bharat @smritiirani @ndtv @INCIndia @narendramodi @manishbpl1 @KKMishraINC @OfficeOfKNath #copyright https://t.co/yvfHxb238B
— Bhumika (@bhumikabirthare) December 1, 2020
వివాదం ఏమంటే..
నవంబరులో శివరాజ్ సింగ్ మామ మృతి చెందారు. ఈ క్రమంలో ఆయన సతీమణి సాధనా సింగ్ తండ్రి ప్రేమపై రాసిన ఓ కవితను ఫ్యామిలీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశారు. దీంతో శివరాజ్ సింగ్ తన భార్య రాసిన కవిత అని నవంబరు 22న ట్విట్టర్‌లో షేర్ చేశారు. అయితే దీనిపై మధ్యప్రదేశ్‌కు చెందిన భూమిక అనే మహిళ తాజాగా ముఖ్యమంత్రికి రీట్వీట్ చేశారు. కవిత రాసింది నేను.. మీ భార్య కాదు అంటూ కామెంట్ చేసింది. తన తండ్రి చనిపోయిన సమయంలో దాన్ని రాశానంటూ వివరించింది.దీంతో ఆమె చేసిన ట్వీట్‌తో ఒక్కసారిగా ముఖ్యమంత్రిపై విపరీతంగా ట్రోలింగ్స్ జరుగుతున్నాయి.