రేనూ మండల్ …ఈమె గుర్తుంది కదా..తేరీ…మేరీ…కహానీ అని పాడుతూ ఆ మధ్య సోషల్ మీడియాలో వైరలైన మహిళ. రైల్వే ప్లాట్ ఫామ్స్ మీద పాటలు పాడుకుంటూ బతికే రేనూ మండల్ పాట విన్న మ్యూజిక్ డైరెక్ట్ హిమేష్ రేష్మియా ఆమెను మరీ వెతికి పట్టుకున్నారు. ఆమె చేత తేరీ..మేరీ..కహానీ పాట పాడించడంతో పాటు తాను నిర్మిస్తున్న ఓ సినిమాలో గాయనిగా కూడా అవకాశమిచ్చారు. ఈ సంఘటన కొన్ని నెలల క్రితం సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఓ సామాన్యురాలు ప్రతిభ ఆ విధంగా వెలికిలోకి వచ్చింది. హిమేష్ రేష్మియా మంచితనం…ఆమె టాలెంట్ పై నెటిజన్లు ప్రశంసలు జల్లు కురిపించారు.
అయితే అదే నెటిజన్లు ఇప్పుడు ఆమెపై సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. కారణమేంటంటే..సోషల్ మీడియా ద్వారా గుర్తింపు రాగానే రేనూ మండల్ లైఫ్ స్టయిల్ చేంజయ్యింది. కట్టు బొట్టూలో చాలా మార్పులొచ్చాయి. ఈ మధ్య కొన్ని కార్యక్రమాలకు కూడా రేనూ మండల్ హాజరవుతున్నారు ఇటీవల ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరై ప్రసంగించింది. ఇంత వరకు బాగానే ఉంది. అయితే ఆమె మేకోవర్ మీదనే విమర్శలన్నీ. తన బాడీ కలర్ కంటే ఎక్కువగా మేకప్ వేసుకొని రావడం…సాంప్రదాయమైన చీరకు బదులుగా లెహెంగా ధరించడమే నెటిజన్ల విమర్శలకు కారణం. 50 ఏళ్ల వయసులో ఇది అవసరమా అన్ని కొందరు విమర్శిస్తుండగా…అమెకు మద్దతు నిచ్చే వారు కూడా లేకపోలేదు. ఎవరెన్ని విమర్శలు చేసినా ఆర్ధిక అభివృద్ధి సాంస్కృతిక అభివృద్ధికి బాటలు వేస్తుందనే చారిత్రక నిజాన్ని కాదనలేం కదా..!