ఇటీవల జబర్దస్త్ యాంకర్ అనసూయ, హీరోయిన్ లావణ్య త్రిపాఠి, యాంకర్ సుమ ఇళ్లపై జీఎస్టీ అధికారులు దాడులు చేశారని వార్తలు వచ్చాయి. అదే విషయమై సుమ స్పందిస్తూ అందులో ఎటువంటి నిజాలు లేవని, ఇలాంటి ఫేక్ న్యూస్ క్రియేట్ చెయ్యకందంటూ ట్విట్టర్ వీడియో పోస్ట్ చేసింది. అది చుసిన అనసూయ నేను ఏమి తక్కువకాదు అనుకుందేమో ట్విట్టర్ వేదికగా తన ఇంటిపై ఎలాంటి దాడులు జరగలేదని, నిజాలు తెలుసుకోకుండా మాట్లాడకందంటూ మీడియా చిందులు తొక్కింది.
అయితే ఇప్పుడు అనసూయకు జీఎస్టీ అధికారులు నోటీసులు ఇచ్చారని తెలుసుకున్న నెటిజన్లు ఆమె పై రివర్స్ లో పంచ్ లు వేస్తున్నారు. ఇప్పుడు ఏమి సమాధానం చెప్తారు అనసూయగారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
సర్వీస్ ట్యాక్స్ కింద 80 లక్షలు అనసూయ కట్టవలసి ఉండగా 25 లక్షలు కట్టిన అనసూయ మిగతా మొత్తాన్ని చెల్లించటానికి కాస్త టైమ్ కావాలని కోరినట్టు సమాచారం.